Share News

Duties should be performed with dedication అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:51 PM

Duties should be performed with dedication పోలీసుశాఖలో హోంగార్డులు కూడా ఒక భాగమని, విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు. 69వ హోంగార్డు అవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు.

Duties should be performed with dedication అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
ర్యాలీలో ఎస్పీ దామోదర్‌

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎస్పీ దామోదర్‌

విజయనగరం క్రైం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలీసుశాఖలో హోంగార్డులు కూడా ఒక భాగమని, విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు. 69వ హోంగార్డు అవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డులు నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధుల్లో హోంగార్డులు కూడా భాగస్వాములవుతూ క్రియాశీలకంగా మారారని, వారందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. 63ఏళ్ల క్రితం దేశ అంతర్గత భద్రతకు పోలీసులకు సహాయపడేందుకు స్వచ్ఛందంగా ఏర్పడిన హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. హోంగార్డుల సంక్షేమానికి రాష్ట్ర పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు బహుమతులు ప్రదానం చేశారు. తొలుత ర్యాలీని ఎస్పీ దామోదర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుంచి మహిళా పోలీసు స్టేషన్‌ వరకూ సాగింది. కార్యక్రమంలో ఏఎస్‌పీ సౌమ్యలత, డీఎస్పీలు కోటిరెడ్డి, రాఘవులు, భవ్యరెడ్డి, సీఐలు ఎవీ లీలారావు, ఆర్‌వీఆర్‌కె చౌదరి, నర్సింహామూర్తి, సూరినాయుడు లక్ష్మణరావు, టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 11:51 PM