మద్యం మత్తులో పీక కోసుకుని..
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:13 AM
మండలంలోని ఎగువతాడి కొండ గ్రామానికి చెందిన ఆరిక చంద్రశేఖర్ (32) మద్యం మత్తులో చాకుతో పీక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎగువతాడికొండలో యువకుడి ఆత్మహత్య
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎగువతాడి కొండ గ్రామానికి చెందిన ఆరిక చంద్రశేఖర్ (32) మద్యం మత్తులో చాకుతో పీక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్విన్‌పేట ఎస్‌ఐ బి.శివ ప్రసాద్ కథనం మేరకు.. పుట్టుకతో చెవిటి, మూగ అయిన చంద్రశేఖర్ తాగుడికి బానిసయ్యా డు. అప్పుడప్పుడు తాగిన మైకంలో పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తాడు. కురుపాం మండలంలోని తెన్నుఖర్జలోని చెల్లి ఇంటికి వెళ్లి కూడా అలాగే తాగి వ్యవహరిం చాడు. ఆమె మందలించడంతో ఎగువ తాడికొండకు మూడు రోజుల కిందట వచ్చాడు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఎక్కువగా సేవించాడు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మత్తులో గొంతును చాకుతో కోసుకున్నాడు. అధిక రక్తస్రావంతో ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు తాడికొండలోని పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక వైద్య సేవలు అనంతరం భద్రగిరి సీహెచ్‌సీ కి అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం ఆసుపత్రికి రిఫర్ చే శారు. అక్కడకు చేరిన వెంటనే కొద్దిసేపటికే చంద్రశేఖర్ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చంద్రశేఖర్ తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతిచెందారు. అన్న కిషోర్‌తో కలిసి ఎగువ తాడికొండలో జీవిస్తున్నాడు.