Share News

Drug Trafficking మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:24 PM

Drug Trafficking Must Be Stopped జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది.

Drug Trafficking   మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసే వారికి విధిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాంతం మీదుగా జరిగే మత్తు అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా పెట్టాలి. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వల్ల కలిగే చెడు ప్రభా వాలపై గ్రామస్థాయిలో, విద్యా సంస్థలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విషయంలో అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలి.’ అని తెలిపారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 17 కేసుల్లో 40 మందిని అరెస్టు చేశామని, 2,054 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 16 వాహనాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. అనుమానంగా ఉండే దుకాణాలు, వాహనాలపై నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ ఎం.రాంబాబు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి, డీఎఫ్‌వో ప్రసూన, జిల్లా రవాణా అధికారి టి.దుర్గా ప్రసాద్‌రెడ్డి, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:24 PM