Driving Training మహిళలకు డ్రైవింగ్‌పై శిక్షణ
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:31 PM
Driving Training for Women మన్యంలో షెడూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా షెడూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యానిర్వాహక సంచాలకులు డి.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈనెల 5లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
పార్వతీపురం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మన్యంలో షెడూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా షెడూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యానిర్వాహక సంచాలకులు డి.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈనెల 5లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కనీసం ఒక సంవత్సరం కాలపరిమితి ఉన్న లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ డ్రైవింగ్ లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ర్టేషన్ పత్రాలను జత చేయాలని పేర్కొన్నారు. వాటిని కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ విజయనగరం కార్యాలయానికి అందించాలన్నారు. ఇతర వివరాలకు 90300 14742, 96424 60838, 96526 00967 నెంబర్లను సం ప్రదించాలన్నారు. ఎంపికైన వారికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన డ్రైవింగ్ పాఠశాలల్లో శిక్షణ అందిస్తామని వెల్లడించారు.