Share News

డ్రైవర్లకు రూ.15వేలు ఇవ్వాలి

ABN , Publish Date - Jul 28 , 2025 | 11:58 PM

లైసెన్స్‌ ఉన్న ప్రతి డ్రైవర్‌కు వాహన మిత్ర పథకంలో భాగంగా రూ.15వేలు అందించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.

డ్రైవర్లకు రూ.15వేలు ఇవ్వాలి
నిరసన చేస్తున్న ఆటో డ్రైవర్లు

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): లైసెన్స్‌ ఉన్న ప్రతి డ్రైవర్‌కు వాహన మిత్ర పథకంలో భాగంగా రూ.15వేలు అందించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం వల్ల ఆటో, టాటా ఏసీ, మాక్సీక్యాబ్‌ వాహన డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డిజిల్‌ ధరలును తగ్గించాలని కోరారు.

Updated Date - Jul 28 , 2025 | 11:58 PM