పుల్లేరుగుడ్డివలసలో తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:12 AM
పుల్లేరుగుడ్డివలసలో గిరిజనులు తాగునీటికి అగచాట్లకు గురవు తున్నారు. గ్రామంలో తాగునీటి పథకం మోటారు పాడవ్వడంతో తాగునీటి కోసం గడిగెడ్డకు వెళ్లి నీటిని బిందెలతో తీసుకురావాల్సివస్తోందని మహిళలు వాపోతున్నారు.
సాలూరు రూరల్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పుల్లేరుగుడ్డివలసలో గిరిజనులు తాగునీటికి అగచాట్లకు గురవు తున్నారు. గ్రామంలో తాగునీటి పథకం మోటారు పాడవ్వడంతో తాగునీటి కోసం గడిగెడ్డకు వెళ్లి నీటిని బిందెలతో తీసుకురావాల్సివస్తోందని మహిళలు వాపోతున్నారు. పదిరోజులుగా మోటారు పాడవ్వడం తాగునీటిసరఫరా కావడం లేదని వారువాపోయారు.తాగునీరు,ఇతర అవసరాల కోసం సమీపంలో ఉన్న గడిగెడ్డనుంచి నీటిని తుప్పలు, డొంకలు దాటుకుని మోసుకురావల్సివస్తోందని పలువురు గ్రామస్థులు వాపోతున్నారు. కాగా మోటారు బాగు చేయ డానికి ఇచ్చామని, రెండు రోజుల్లో తాగునీటి సరఫరా పునరుద్దరిస్తామని సాలూరు ఎంపీడీవో గొల్లపల్లి పార్వతీ తెలిపారు.