wood తరలిపోతున్నా.. పట్టించుకోరా?
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:10 AM
Drifting Away... Yet No One Cares? సీతంపేట ఏజెన్సీలో ఎంతో విలువైన అటవీ సంపదపై అక్రమార్కుల కన్ను పడింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా టేకు కలపను అక్రమంగా రవాణా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. యథేచ్ఛగా ఈ దందా సాగు తున్నా.. అటవీశాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
యథేచ్ఛగా అక్రమ కలప రవాణా
చోద్యం చూస్తున్న అటవీశాఖ
సీతంపేట రూరల్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో ఎంతో విలువైన అటవీ సంపదపై అక్రమార్కుల కన్ను పడింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా టేకు కలపను అక్రమంగా రవాణా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. యథేచ్ఛగా ఈ దందా సాగు తున్నా.. అటవీశాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వాస్తవంగా సీతంపేట మండలానికి సరిహద్దులో కడగండి, పొల్ల, చిన్నబగ్గ, పూతికవలస, మర్రిపాడు, కుసిమి, కోతాం, గుడ్డిమీదగూడ, సారంగి గ్రామాలున్నాయి. ఆయా ప్రాంతాల మీదుగా టేకు, నేరడి, చింత, గుగ్గిలం, ఇరిడి కలపను అక్రమార్కులు ప్రైవేట్ వాహనాల ద్వారా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండ ప్రాంతంలో కలప చెట్లను యంత్రాలతో కట్‌చేసి రవాణాకు అనువుగా మారుస్తున్నారు. అనంతరం టేకు దుంగలను కర్రల డిపోలకు తరలి స్తున్నారు. పట్టపగలే పాలకొండ- హడ్డుబంగి రహదారి గుండా పాలకొండ, కొత్తూరు అటవీశాఖ కార్యాలయాలు, ఫారెస్ట్ చెక్‌పోస్టులు దాటి కలప తరలిపోతున్నా పట్టించుకునే వారే కరువ య్యారు. వాల్టా చట్టం నిబంధనల మేరకు ఎవరైనా చెట్టును నరకాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. అంతేకాకుండా ప్రభుత్వానికి చెట్టు విలువ చెల్లించి అదనంగా మొక్కలు నాటాల్సి ఉంది. ఇవేమీ పట్టని అక్రమార్కులు సీతంపేట ఏజెన్సీలోని విలువైన కలపను కొల్లగొట్టేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.
ప్రత్యేక నిఘా పెట్టాం..
‘సీతంపేట ఏజెన్సీలో విలువైన కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా చెట్లను నరికితే చట్టపరమైన చర్యలు తీసుకుం టాం. అటవీ సంపదను పరిరక్షిస్తున్నాం’ అని పాలకొండ అటవీశాఖ రేంజ్ అధికారి రామారావు తెలిపారు.