dream of own home సొంతింటి కల సాకారమే లక్ష్యం
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:01 AM
dream of own home పేదవారి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంటివలస గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన నూతన గృహాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
సొంతింటి కల సాకారమే లక్ష్యం
నూతన గృహాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్
బొండపల్లి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పేదవారి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంటివలస గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన నూతన గృహాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలంలోనే మూడు లక్షల గృహాలు నిర్మించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న గృహాలకు ఆర్థిక సాయం అందించి గృహాలు పూర్తిచేయడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైన పాత్ర పోషించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రూ.20 లక్షల ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనపు సహాయం అందిస్తోందని, మిగతా వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ డి.రాజేశ్వరరావు, ఎంపీడీవో గిరిబాల, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ మర్రాపు సురేష్, టీడీపీ మండల అధ్యక్షుడు రాపాక అచ్చుంనాయుడు తదితరులు పాల్గొన్నారు.