సాలూరు ఎంఐజీ లేఅవుట్‌లో ప్లాట్లకు డ్రా
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:04 AM
బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా) పరిధిలోని సాలూరు పట్టణంలో ఎంఐజీ లేఅవుట్‌లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంగళవారం స్థానిక బుడా కార్యాలయం లో చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు ఆన్‌లైన్‌లో డ్రా తీసి స్థలాలను కేటాయించారు.
లేఅవుట్ అభివృద్ధికి రూ.9కోట్లతో టెండర్లు
బొబ్బిలి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా) పరిధిలోని సాలూరు పట్టణంలో ఎంఐజీ లేఅవుట్‌లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంగళవారం స్థానిక బుడా కార్యాలయం లో చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు ఆన్‌లైన్‌లో డ్రా తీసి స్థలాలను కేటాయించారు. ఈ లేఅవుట్‌లో ఫస్ట్‌పేజ్‌లో 109, సెకెండ్ ఫేజ్‌లో 75 ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఇంతవరకు రెండు విడతలుగా స్థలాలను కేటాయించామ ని, ఇప్పుడు మూడో విడతలో 17 మందికి ప్లాట్లను కేటా యిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ లేఅవుట్‌లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సుమా రు రూ.9 కోట్లతో టెండర్లు ప్రక్రియ పూర్తయిందని, ప్రభు త్వం నుంచి రేపోమాపో అనుమతి వస్తుందన్నారు. ఎంఐ జీ లేఅవుట్‌లో ప్లాట్లు విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకమైన బ్యాంకు అకౌంట్‌లో జమచేసి, కేవలం దాని అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు. ఇది లబ్ధిదా రులకు, పనులు చేపట్టే కాంట్రాక్టరుకు భరోసా అని అన్నారు. సాలూరు ఎంఐజీ లేఅవుట్ ప్రైవేటు లేఅవు ట్‌ను తలదన్నే విధంగా ఉంటుందన్నారు. బొబ్బిలి, పార్వ తీపురం పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్ల ఏర్పాటు కోసం స్థల సేకరణ ప్రక్రియ జరుగుతోందన్నారు. ప్రభుత్వ స్థలాలేవీ అందుబాటులో లేని పక్షంలో ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేసి మధ్యత రగతి వర్గాల వారికి కేటాయించే వెసులుబాటు కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. బుడా పరిధిలోని సుమారు 415 పంచాయతీలకు లేఖలు రాశామని, భవనాల నిర్మా ణాలకు ప్లాన్లు ఇచ్చే పూర్తి అధికారం ఆయా పంచా యతీలకే ఉందని, అయితే బుడాకు డెవలప్‌మెంట్ ఫీజు విధిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యవస్థకు సంబంధించి మోనటరింగ్ చేసే ప్రక్రి యలో భాగంగా వారికి లేఖలు రాశామన్నారు. పంచాయతీలు ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూ రు చేస్తాయని చెప్పారు. అనధికార లేఅవుట్లపై కూడా దృష్టి సారించినట్టు తెంటు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవో దేవకుమార్, పంచాయతీ కార్యదర్శులు, బుడా సిబ్బంది, లైసెన్స్‌డ్ సర్వేయర్లు పాల్గొన్నారు.