యూరియా కోసం ఆందోళన వద్దు
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:44 PM
రైతులు ఎవరూ యూరియా కోసం ఆందోళన చెందవద్దని ఆర్డీవో డి.కీర్తి తెలిపారు.
డెంకాడ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రైతులు ఎవరూ యూరియా కోసం ఆందోళన చెందవద్దని ఆర్డీవో డి.కీర్తి తెలిపారు. సోమవారం ఆమె చొల్లంగిపేట రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా యూరియా పంపిణీపై రైతులు ఆందోళన చేశారు. దీంతో ఆమె తోపాటు విజయనగరం సబ్ డివిజన్ ఏడీఏ నాగభూషణరావు, తహసీల్దార్ రాజారావు, పోలీసులు, వ్యవసాయాధికారి పి.సంగీత స్పందించారు. రైతులకు కావాల్సిన యూరియాను పంపిణీ చేస్తామ న్నారు. చల్లంగిపేట రైతు సేవా కేంద్రానికి 173 బస్తాల యూరియా రాగా, ఉదయం పంపిణీ ప్రారంభించారు. అయితే అందరికీ సరిపోయినంత యూరియా వచ్చినా తర్వాతే పంపిణీ ప్రారంభించాలని రైతులు అధికారులను కోరారు. దీంతో అధికారులు యూరియా పంపిణీ నిలిపివేసి, జిల్లా కంట్రోల్ రూంకు తెలియజేశారు. వెంటనే ఇంకొక 266 బస్తాలు విజయనగర ం నుంచి తీసుకువచ్చి, చొల్లంగిపేటలోని 6 రెవెన్యూ గ్రామాల రైతులకు పంపిణీ చేశారు. యూరియా పంపిణీ సజావుగా చేసినట్టు ఏడీఏ తెలిపారు.