Don’t Worry ఆందోళన చెందొద్దు
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:42 PM
Don’t Worry కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన 140 మంది విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మంగళవారం తెలిపారు.
35 మంది డిశ్చార్జి
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం/బెలగాం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన 140 మంది విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రాసుపత్రిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. 140 మందిలో 57 మందిని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించామని , ప్రస్తుతం 83 మంది విద్యార్థినులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. వారిలో 35 మందిని ఈ ఒక్కరోజే డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించామన్నారు. ఇంటికి వెళ్లిన వారి ఆరోగ్య స్థితిని రోజూ ఏఎన్‌ఎం పర్యవేక్షించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా విశాఖ కేజీహెచ్‌కు పంపిన వారిలో 13 మంది కోలుకున్నారని, వారిలో 8 మంది పార్వతీపురం వస్తున్నారని వెల్లడించారు. వారిని జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామన్నారు.
బోధనా సిబ్బందిలో ఒకరికి జాండీస్
పార్వతీపురం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కురుపాం గురుకుల పాఠశాల బాలికలతో పాటు బోధనా సిబ్బందికి రక్త పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే బోధనా సిబ్బందిలో ఒకరికి పచ్చకామెర్లు వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించి వైద్యసేవలు అందిస్తున్నారు.