Share News

డీజేలను వినియోగించవద్దు: సీఐ

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:39 PM

పార్వతీపురంలో వినాయక చవితి, దసరా ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులు డీజేలతోపాటు అధిక శబ్దాలను ఇచ్చే పరికరాలను వినియోగించవద్దని పట్టణ పోలీసు స్టేషన్‌ సీఐ మురళీధర్‌ తెలిపారు.

డీజేలను వినియోగించవద్దు: సీఐ
డీజే నిర్వాహకులతో మాట్లాడుతున్న సీఐ మురళీధర్‌,ఎస్‌ఐ గోవిందరావు:

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో వినాయక చవితి, దసరా ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులు డీజేలతోపాటు అధిక శబ్దాలను ఇచ్చే పరికరాలను వినియోగించవద్దని పట్టణ పోలీసు స్టేషన్‌ సీఐ మురళీధర్‌ తెలిపారు.పండుగల సందర్భంగా డీజేల వల్ల ఎవరైనా చనిపోతే సంబంధిత యజమానులకు శిక్షతప్పదన్నారు.గురువారం పట్టణ పోలీసు స్టేషన్‌లో డీజేల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ వినాయకచవితి, దసరా అనుపోత్సవాల్లో నిబంధనలు పాటించాలన్నారు.కార్యక్రమంలో పట్టణఎస్‌ఐ గోవిందరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:39 PM