వినతుల స్వీకరణతో సరిపెట్టకండి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:32 AM
బొడ్డవరలో రెండు రోజుల కిందట నిర్వహించిన గ్రామసభ కేవలం వినతుల స్వీకరణ సభగా కాకుండా సమస్యల పరిష్కార సభగా మార్చాలని జిందాల్ నిర్వాసితులు కోరారు.
కొనసాగుతున్న జిందాల్ నిర్వాసితుల నిరసన
ఎస్.కోట రూరల్ సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): బొడ్డవరలో రెండు రోజుల కిందట నిర్వహించిన గ్రామసభ కేవలం వినతుల స్వీకరణ సభగా కాకుండా సమస్యల పరిష్కార సభగా మార్చాలని జిందాల్ నిర్వాసితులు కోరారు. గురువారం తమ 73వ రోజు నిరసనలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ పాల్గొని, మాట్లాడారు. ఈ గ్రామసభలో మెజార్జీ రైతులు తమ భూములు ఇప్పించాలని కోరుతున్నారని రైతుల భూములు వారికే ఇప్పించాలనీ కోరారు. ఒక తరం నాశనంచేసిన జిందాల్‌కు శతకోటి దండాలు అంటూ నమస్కారాలుచేశారు.
ఢిల్లీ నుంచి వచ్చిన నోటీసుల ఫలితమే..
బొడ్డవర గ్రామంలో రెండు రోజుల కిందట నిర్వహించిన గ్రామసభ తామ పోరాట ఫలితమే అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొద్దిరోజుల కిందట ఢిల్లీ వెళ్లి జాతీయ హ్యూమన్ రైట్స్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, వినియోగదారుల ఫోరం చైర్మన్‌ల ను కలిసి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు వివరిం చామన్నారు. అక్కడ ఆదేశాలతో గ్రామసభ నిర్వహించినట్టు భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా స్పందించిన అధికారులకు ధన్యవాదాలని అన్నారు.