Don't rely on a single crop. ఒకే పంటపై ఆధార పడొద్దు
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:19 AM
Don't rely on a single crop. ఒకే పంటపై రైతులు ఆధారపడి నష్టపోకుండా అంతర పంటలు కూడా వేసి లాభం పొందాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా శనివారం రావివలస గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల ఇంటికి వెళ్లి మాట్లాడారు.
ఒకే పంటపై ఆధార పడొద్దు
అంతర్ పంటల సాగుతో లాభాలు
‘రైతన్నా మీకోసం’లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గంట్యాడ, నవంబరు 29(ఆంరఽధజ్యోతి): ఒకే పంటపై రైతులు ఆధారపడి నష్టపోకుండా అంతర పంటలు కూడా వేసి లాభం పొందాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా శనివారం రావివలస గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల ఇంటికి వెళ్లి మాట్లాడారు. రైతులకు కూటమి ప్రభుత్వం అందించిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వరి పంట ఒక్కదానిపై రైతులు ఆధారపడకుండా ఆయిల్ పామ్ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. అలాగే వ్యాణిజ్య పంటలపైనా దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ పంటలు పండించాలని సూచించారు. మంచి దిగుబడి వచ్చేలా సాగు చేయాలని, పొలాల్లో విద్యుత్ బోర్లు వేసుకోవాలని అందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, తహశీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి, ఎంపీడీవో రమణమూర్తి, వ్యవసాయ శాఖ ఏడీ నాగభూషన్, ఏవో శ్యామ్‌కుమార్, పంచాయతీరాజ్ జేఈ కృష్ణమూర్తి, వెలుగు ఏపీఎం సులోచనదేవి, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ నానిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టరు అల్లు విజయకుమార్, టీడీపీ నాయకులు రంది చినరామునాయుడు, రంధి అర్జున మహేశ్వరరావు, కళ్ళెంపూడి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.