Students' Health విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:58 PM
Don't Neglect Students' Health గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ హెచ్చరించారు. శుక్రవారం డోకిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.
పార్వతీపురం రూరల్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ హెచ్చరించారు. శుక్రవారం డోకిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను పరా మర్శించారు. వారి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం ఉపాధ్యాయలు, వైద్య సిబ్బందితో సమీక్షించారు. సీజనల్ వ్యాధుల ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవా లన్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు ఎప్పటికప్పుడు విద్యార్థులను పరిశీలించాలన్నారు. ప్రత్యేక శ్రద్ధను కనబర్చాలని లేకుంటే ఉపేక్షించేది లేదన్నారు. వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత సంక్షేమ, వైద్యాధికారులపై ఉందన్నారు. ఇకపై ఇటువంటివి పునరావృతం కారాదని, విద్యార్థులు అనారోగ్యానికి గురైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని పీవో స్పష్టం చేశారు. ఆయన వెంట గిరిజన సంక్షేమశాఖ డీడీ ఆర్.కృష్ణవేణి, ఇతర అధికారులు ఉన్నారు.
ఆదివాసీ దినోత్సవంలో భాగస్వాములు కావాలి
పార్వతీపురం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఈ నెల 9న నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శ్రీవాత్సవ గిరిజన సంఘాల నాయకులను కోరారు. స్థానిక గిరిమిత్ర సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. వేడుకలకు సంబంధించి తగిన సూచనలు, సలహాలు అందించాలన్నారు. అర్హులైన గిరిజనులకు ఉపకరణాలు, వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయనున్నామని వెల్లడించారు.