Garbage Collection చెత్త సేకరణపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:57 PM
Don’t Neglect Garbage Collection పంచాయతీల పరిధిలో చెత్త సేకరణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కె.కొండలరావు హెచ్చరించారు. బుధవారం సుంకిలో పారిశుధ్య నిర్వహణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పంచాయతీల పరిధిలో చెత్త సేకరణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కె.కొండలరావు హెచ్చరించారు. బుధవారం సుంకిలో పారిశుధ్య నిర్వహణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా దృష్టి సారించాలన్నారు. గృహాల నుంచి సేకరించిన వ్యర్థాలను తడి, పొడిగా వేరు చేసి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కరుస్తున్న దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా చూడాలని, విధిగా క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పరిశీలనలో డిప్యూటీ ఎంపీడీవో ఎల్.గోపాలరావు, సర్పంచ్ కె.రవీంద్ర, కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.