Share News

Revenue Applications రెవెన్యూ అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:35 PM

Don’t Keep Revenue Applications Pending రెవెన్యూ అర్జీలను పెండింగ్‌ పెట్టరాదని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌ను సందర్శించారు.

 Revenue Applications   రెవెన్యూ అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు
రెవెన్యూ వినతులు పరిశీలిస్తున్న జేసీ

పార్వతీపురం, నవంబరు17(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ అర్జీలను పెండింగ్‌ పెట్టరాదని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌ను సందర్శించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడారు. పీజీ ఆర్‌ఎస్‌కు వచ్చిన దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కార మార్గం చూపాలన్నారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు, ఆర్‌.వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:35 PM