Share News

స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయవద్దు

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:22 PM

రాష్ట్ర ప్రభుత్వం గృహలకు స్మార్ట్‌మీటర్లు బిగించేందుకు ప్రయత్నిస్తోందని, పాతమీటర్లే కొనసాగించాలని సీపీఐ ఎంల్‌ నాయకులు రెడ్డి నారాయణరావు కోరారు.

స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయవద్దు
ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐఎంఎల్‌ నాయకులు:

విజయనగరం దాసన్నపేట, ఆగస్టు 3 ( ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గృహలకు స్మార్ట్‌మీటర్లు బిగించేందుకు ప్రయత్నిస్తోందని, పాతమీటర్లే కొనసాగించాలని సీపీఐ ఎంల్‌ నాయకులు రెడ్డి నారాయణరావు కోరారు. ఆదివారం లంకాపట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా బకాయిలు, ట్రూ ఆప్‌ ఛార్జీలు పేరుతో వసూలు చేస్తున్నారన్నారు.వేలాది కోట్లు రూపాయలు ప్రజలపై భారం మోపడం విడ్డూరంగాఉందన్నారు. కార్యక్రమంలో ఆటోయూనియన్‌ నాయ కులు అప్పలరాజురెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 11:22 PM