ప్రలోభాలకు ఆశ పడొద్దు
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:25 AM
టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరు అని కోటి రూపాయలు ఇచ్చినా ప్రలోభాలకు లొంగిపోరని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
ఎమ్మెల్యే విజయచంద్ర
టీడీపీ నాయకులతో సమావేశం
ఙపార్వతీపురం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరు అని కోటి రూపాయలు ఇచ్చినా ప్రలోభాలకు లొంగిపోరని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, గ్రామ కమిటీల నాయకులతో శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయ న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆర్‌ఎస్ ఎస్, హైదరాబాద్‌లో మజ్లీస్ పార్టీలు మాదిరిగా కోట్లా ది రూపాయలతో ప్రతిపక్షాలు ఎన్నో ప్రలోభాలు పెట్టినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆశ పడరాద న్నారు. త్వరలో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సి ఉందన్నారు. పార్టీ పరిశీలకుడిగా వచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పట్ల ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉందన్నా రు. కురుపాం, పాలకొండ, సాలూరు పార్టీ పరిశీ లకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.