Share News

డబ్బులు చెల్లించే వరకూ పనులు చేయవద్దు

ABN , Publish Date - May 09 , 2025 | 12:05 AM

తమ భూము లకు డబ్బులు చెల్లించే వరకూ పనులు చేయ వద్దని సారెపల్లి గ్రామా నికి చెందిన తారకరామా తీర్థసాగర్‌ ప్రాజెక్టు నిర్వా సితులు ఆ ప్రాజెక్టు అధి కారులను నిలదీశారు.

 డబ్బులు చెల్లించే వరకూ పనులు చేయవద్దు
అధికారులతో మాట్లాడుతున్న నిర్వాసితులు

నెల్లిమర్ల, మే 8(ఆం ధ్రజ్యోతి): తమ భూము లకు డబ్బులు చెల్లించే వరకూ పనులు చేయ వద్దని సారెపల్లి గ్రామా నికి చెందిన తారకరామా తీర్థసాగర్‌ ప్రాజెక్టు నిర్వా సితులు ఆ ప్రాజెక్టు అధి కారులను నిలదీశారు. సారెపల్లికి చెందిన తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్ట్‌ సర్పర్‌ కాలువ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు సేకరించిన 15 ఎకరాల భూమిలో ప్రాజెక్టు అధికారులు పనులు చేసేందుకు గురువారం వచ్చారు. తమకు రావాల్సిన డబ్బులను ఇవ్వకుండా పనులు చేస్తే ఊరుకునేది లేదని అడ్డుకున్నారు. భూమికి సంబంధించి రూ.3 కోట్ల 17లక్షలు ఇవ్వకుండా విశాఖ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ అథారిటీ ఆఫీసులో డిపాజిట్‌ చేయడంపై ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. సమస్యలను పరిష్కరించ కుండా పనులు చేయవద్దని నిర్వాసితులు ఈఈ అప్పలనాయుడు, డీఈ రమణను నిలదీశారు. గట్టు నిర్మాణం జరిగితే ఊరుకునేది లేదని గ్రామస్థులు కోరారు.ఈ సమస్యపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు చెప్పడంతో సమస్య సద్దుమనిగింది. కార్యక్రమంలో సారెపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బోనుమంతి ఆదినారాయణ, సారెపల్లి బాబూరావు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 12:05 AM