Share News

Failures వైఫల్యాలను కప్పిపుచ్చుకోవొద్దు

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:04 AM

Don't Cover Up Failures పదో తరగతి ఫలితాల సాధనలో వెనుకబడిన వివిధ పాఠశాలల హెచ్‌ఎంలపై ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వైఫల్యాలను గిరిజన విద్యార్థులపై నెట్టి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు.’ అని అన్నారు.

  Failures  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి

  • పాఠశాలల వారీగా సమీక్ష

  • హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూవో, టీచర్లపై ఆగ్రహం

సీతంపేట రూరల్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల సాధనలో వెనుకబడిన వివిధ పాఠశాలల హెచ్‌ఎంలపై ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వైఫల్యాలను గిరిజన విద్యార్థులపై నెట్టి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు.’ అని అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల, పోస్టుమెట్రిక్‌ పాఠశాలల హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల వారీగా సమీక్షించారు. పదో తరగతి శతశాతం ఫలితాలు సాధనలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విఫలమయ్యారని పీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులపై బాధ్యతగా వ్యవహించాలని, డ్రాపౌట్లుగా మారకుండా చూడాలని ఆదేశించారు. పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల విద్యా ప్రమాణాలు స్థాయిని ఏటీడబ్ల్యూవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల న్నారు. పాఠ్యాంశాలు సక్రమంగా భోదించకుండా ఫలితాలు ఏవిధంగా సాధిస్తారని హెచ్‌ఎంలను ప్రశ్నించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులు అందరూ పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. ఎన్‌రోల్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించి పాఠశాలల వారీగా లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, డిప్యూటీ డీఈవో కుమార్‌, ఏఎంవో కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:04 AM