Share News

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:40 PM

అర్జీలపరిష్కారంలో నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. సోమవారం విజయనగరంలోని కలెక్టరేట్‌ ఆడిటోరియం లో అర్జీదారులు నుంచి వినతులు స్వీకరిం చారు.ఈసందర్భంగా 178వినతులు అందగా, ఇందులో 86 వినతులు రెవెన్యూశాఖకు, పం చాయతీరాజ్‌, విద్యుత్‌శాఖలకు ఆరేసి చొప్పు న, డీఆర్‌డీఏకు 27, మునిసిపాల్టీకి సంబం ధించి 11, విద్యాశాఖకు 10, వైద్య శాఖకు రెండు వినతులు వచ్చాయి.

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
వినతిని పరిశీలిస్తున్న అంబేడ్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 21(ఆం ధ్రజ్యోతి):అర్జీలపరిష్కారంలో నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. సోమవారం విజయనగరంలోని కలెక్టరేట్‌ ఆడిటోరియం లో అర్జీదారులు నుంచి వినతులు స్వీకరిం చారు.ఈసందర్భంగా 178వినతులు అందగా, ఇందులో 86 వినతులు రెవెన్యూశాఖకు, పం చాయతీరాజ్‌, విద్యుత్‌శాఖలకు ఆరేసి చొప్పు న, డీఆర్‌డీఏకు 27, మునిసిపాల్టీకి సంబం ధించి 11, విద్యాశాఖకు 10, వైద్య శాఖకు రెండు వినతులు వచ్చాయి. వీటిని కలెక్టర్‌ అంబేడ్కర్‌, జేసీసేతుమాధవన్‌, డీఆర్వో శ్రీనివాస్‌మూర్తి, డిప్యూటీకలెక్టర్‌ మురళి, ప్రమీలాగాంధీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండానాణ్యతతో పరిష్కరిం చాలని అధికారులను కోరారు.

డ్రోన్లు వినియోగించాలి

నానో ఎరువులు వాడకానికి డ్రోన్లను విని యోగించాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశిం చారు.సోమవారం విజయనగరంలో వ్యవసా యశాఖ రూపొందించి చీడ పురుగులు నుం చి పంటను కాపాడేందుకు దోహదపడే జీ వన ఎరువులు ఆవశ్యకతను, నానో ఎరువు లు ప్రచారం బ్రోచర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నానోఎరు వుల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు.

ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు

వైద్య ఆరోగ్యశాఖలో ఉత్తమసేవలను అం దించిన డాక్టర్లు,సిబ్బందికి సోమవారం కలె క్టరు అంబేడ్కర్‌ తనచాంబర్‌లో ప్రశంసాప త్రాలు అందించారు. ఈనెల 11న జరిగిన అంతర్జ్జాతీయ జనాభాదినోత్సవం పురస్కరిం చుకుని వైద్య శాఖలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

Updated Date - Jul 21 , 2025 | 11:40 PM