దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:05 AM
పత్తి రైతులు దళారులను ఆశ్రయించి మోస పోవద్దని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ కోరారు. బుధవారం రాజాంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు గ్రామాలకు వెళ్లి మద్దతు ధర విషయంలో ముమ్మరంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
రాజాం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పత్తి రైతులు దళారులను ఆశ్రయించి మోస పోవద్దని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ కోరారు. బుధవారం రాజాంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు గ్రామాలకు వెళ్లి మద్దతు ధర విషయంలో ముమ్మరంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ రవికిరణ్, సీసీఐ అధికారి బైయార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సమతం శ్రీని వాసరావు, చైర్మన్ గురవాన పార్వతి వైస్ చైర్మన్ లక్షుభుక్త ధనలక్ష్మి, నాయకు లు నంగి సూర్యప్రకాష్‌రావు, గురవాన నారాయణరావు, వంగా వెంకటరావు,శాసపు రమే ష్‌కుమార్, టంకాల నాగరాజు, నాగళ్ల అప్పలనాయుడు పాల్గొన్నారు,
నిధులు మంజూరుకు కృషి చేయాలి
మార్కెట్ కమిటీల ద్వారా లింక్ రోడ్లు నిర్మాణం, పశవైద్యశిబిరాలు, నిర్వహించడం తోపాటు వివిధ అభివృద్ధికార్యక్రమాలకు నిధులు మంజూరుచేసేలా కృషి చేయాలని ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు మన్యం జిల్లాలకు చెందిన ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కోరారు.ఈ మేరకు శ్యాంపురంలోని క్యాంపు కార్యాలయంలలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు.
కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం
కార్యకర్తల సంక్షేమమే ధ్యేయమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.శ్యాంపురం క్యాంపుకార్యాలయంలో రాజాం టౌన్, రాజాం రూరల్, వంగర, సంతకవిటి, రేగిడి మండల టీడీపీ గ్రామ, వార్డు కమిటీ, క్లస్టర్, బూత్, యూనిట్ కమిటీల ప్రమాణ స్వీకారకార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కొల్ల అప్పలనాయుడు, బొత్స వాసుదేవరావునాయుడు, దుప్పలపూడి శ్రీనివాసరావు, వంగా వెంకటరావు, దూబ ధర్మారావు, గట్టి భాను, గట్టి రఘు, వల్లూరు గణేస్, సమతం శ్రీను పాల్గొన్నారు