Share News

అధైర్య పడొద్దు

ABN , Publish Date - May 06 , 2025 | 12:22 AM

అధైర్యపడొద్దు గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారు.

అధైర్య పడొద్దు

  • గిరిజనులకు అండగా ఉంటాం: మంత్రి సంధ్యారాణి

సాలూరు, మే 5(ఆంధ్రజ్యోతి): అధైర్యపడొద్దు గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. సోమవారం ఏజెన్సీ స్పెషల్‌ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు మంత్రిని సాలూరులోని తన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ జీవో నెంబర్‌3కి సమాన ప్రయోజనాలున్న వేరొక జీవోను తీసుకువస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ 2025లో గిరిజనులకు కేటాయించిన ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:22 AM