Share News

Donated Blood 42 Times 42 సార్లు రక్తదానం

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:21 AM

Donated Blood 42 Times ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 42 సార్లు రక్తదానం చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు ముంజి మురళీకృష్ణ. పాలకొండలో నీలమ్మకాలనీలో నివాసం ఉంటున్నారు. 2007లో వరంగల్‌లో కైట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న సమయంలో తొలిసారి రక్తదానం చేశారు.

Donated Blood 42 Times 42 సార్లు రక్తదానం
రక్తదానం చేస్తున్న మురళీకృష్ణ

నేడు ప్రపంచ రక్త దాతల దినోత్సవం

పాలకొండ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 42 సార్లు రక్తదానం చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు ముంజి మురళీకృష్ణ. పాలకొండలో నీలమ్మకాలనీలో నివాసం ఉంటున్నారు. 2007లో వరంగల్‌లో కైట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న సమయంలో తొలిసారి రక్తదానం చేశారు. రెడ్‌ క్రాస్‌ని ఆదర్శంగా తీసుకొని క్రియా అనే ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఆపదలో ఉన్న వందలాది మందికి ఆయన రక్తదానం చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరంలో కూడా రక్తదానం చేస్తానని ఆయన వెల్లడించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహలు వీడాలని సూచించారు. ఒకసారి శ్రీకాకుళానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైతే.. తాను పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్లి రక్తం దానం చేసినట్లు గుర్తు చేశారు. తాను చేసిన సేవలకు రెడ్‌ క్రాస్‌ సొసైటీ , అప్పటి శ్రీకాకుళం కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ , ఇటీవల పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు పొందినట్లు తెలిపారు. రక్తదానానికి ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Jun 14 , 2025 | 12:21 AM