Share News

నేటి నుంచి లివిరిలో డోలోత్సవాలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:23 AM

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో వంశధార నదీ తీరాన వెలసిన లివిరి గోపీనాథ రాధారాణి ఆలయం డోలోత్సవానికి ముస్తాబ య్యింది.

నేటి నుంచి లివిరిలో డోలోత్సవాలు
గోపీనాథ రాధారాణి ఉత్సవ విగ్రహం

భామిని, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో వంశధార నదీ తీరాన వెలసిన లివిరి గోపీనాథ రాధారాణి ఆలయం డోలోత్సవానికి ముస్తాబ య్యింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఈ ఉత్స వాలు ప్రారంభం కానుండగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పర్లాకిమిడి గజపతిరాజుల ఇష్టదైవమైన గోపీనాథ రాధారాణికి ఆలయ సంప్రదాయ ప్రకారం విశేష పూజలు చేసేందుకు గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.

పాలకొండలో కామదహనం

పాలకొండ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక జగన్నా థస్వామి బలభద్రుని, సుభద్ర దేవాలయం పరిధిలో బుధవారం డోలోత్సవాన్ని పురస్కరించుకుని కామదహ నం (హోళీ మఖ) కార్యక్రమం చేపట్టారు. అర్చకుల ఆధ్వర్యంలో వీవర్స్‌ కాలనీలో కామదహనం కార్యక్రమాన్ని చేపట్టారు. అధిక సంఖ్యలో పాల్గొని కామదహనం కార్యక్రమాన్ని తిలకించారు.

Updated Date - Mar 13 , 2025 | 12:23 AM