Do yoga even for a quarter of an hour. పావుగంటైనా యోగా చేయండి
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:53 PM
Do yoga even for a quarter of an hour.ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందించాలనే గొప్ప ఆశయంతో ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపడుతోందని, ఈరోజుతో వదిలేయకుండా ప్రతిరోజు మీ నివాసాల్లో ఒక పావుగంట అయినా యోగా చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ముషిడిపల్లి పంచాయతీ చినఖండేపల్లి సమీపంలోని సత్యసాయి ఆశ్రమంలో ఐదువేలమందితో మంగళవారం ఏర్పాటుచేసిన యోగాంధ్ర కార్యక్రమానికి ఉపాధి కూలీలు విశేషంగా తరలివచ్చారు.

పావుగంటైనా యోగా చేయండి
అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ ఆశయం
కలెక్టర్ అంబేడ్కర్
యోగాంధ్రకు వేలాదిగా తరలివచ్చిన ఉపాధి కూలీలు
వర్షం పడుతున్నా ఆసనాల్లోనే..
శృంగవరపుకోట రూరల్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందించాలనే గొప్ప ఆశయంతో ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపడుతోందని, ఈరోజుతో వదిలేయకుండా ప్రతిరోజు మీ నివాసాల్లో ఒక పావుగంట అయినా యోగా చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ముషిడిపల్లి పంచాయతీ చినఖండేపల్లి సమీపంలోని సత్యసాయి ఆశ్రమంలో ఐదువేలమందితో మంగళవారం ఏర్పాటుచేసిన యోగాంధ్ర కార్యక్రమానికి ఉపాధి కూలీలు విశేషంగా తరలివచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప క్రిష్ణ, స్టేట్ టూరిజం బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి సుధారాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు వాతావరణం మారి పోయి చినుకులు మొదలు కావడంతో పెద్దగా హాజరుశాతం ఉండదేమోనని అధికారులు కలవరపడ్డారు. కానీ అంచనాలకు మించి శ్రామికులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ యోగాను అలవాటుగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ నేడు ఆరోగ్యాన్ని విస్మరించి జబ్బులను కొనుక్కుంటున్నామని, అదే ప్రతి ఒక్కరు యోగా చేస్తే జబ్బులు పారిపోయి ఆరోగ్యం వస్తుందన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి పడుతున్న తపనను ఈ యోగాంధ్ర ద్వారా అర్థం చేసుకోవచ్చునన్నారు. టూరిజం బోర్డు డైరెక్టర్ సుధారాజు మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం, ఆనందం లభిస్తుందన్నారు. కాగా ఆరంభం నుంచి వర్షం పడుతున్నా విజయవంతంగా సాగింది. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, ఎంపీపీ సోమేశ్వరరావు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిటైర్డ్ వీసీ ముత్యాలనాయుడు, సత్యసాయి ఆశ్రమం నిర్వాహకుడు సాయి, డీఆర్‌డీఏ పీడీ కల్యాణ్‌చక్రవర్తి, డ్వామా పీడీ శారదదేవి, డిఎంహెచ్‌ఓ జీవనరాణీ, జిల్లా టూరిజం ఆదికారి కుమారస్వామి,లోక్‌సత్తా రాష్ట్ర నేత భీశెట్టీ బాజ్జీ తదితరులు పాల్గొన్నారు.
స్థలం చాలక నిల్చొని చూసి..
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎస్.కోట మండలంలో ఏర్పాటుచేసిన యోగాంధ్రకు స్వచ్ఛందంగా వేలాదిమంది ఉపాధి శ్రామికులు తరలివచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొందరిలో ఉత్సాహం నీరుగారింది. దాదాపు ఆరు వేలకు పైగా ఉపాధి శ్రామికులు తరలివచ్చారు. యోగా చేసేందుకు స్థలం లేకపోవడంతో దూరం నుంచి తిలకించారు.