అనుమతి లేకుండా బాణసంచా విక్రయించవద్దు
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:43 PM
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించినా, తయారు చేసినా, నిల్వ చేసినా చర్యలు తప్పవని సీఐ ఈఏవీ రమణ హెచ్చరించారు. మండలంలోని నెలివాడ, రోళ్లవాక గ్రామాల్లో విజయనగరంలోని దీపావళి సామగ్రికి సంబంధించిన మందుగుండు సామగ్రికి చెందిన గోదాములు ఏర్పాటుచేశారు.
బొండపల్లి, అక్టోబరు 8(ఆంధ్ర జ్యోతి): అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించినా, తయారు చేసినా, నిల్వ చేసినా చర్యలు తప్పవని సీఐ ఈఏవీ రమణ హెచ్చరించారు. మండలంలోని నెలివాడ, రోళ్లవాక గ్రామాల్లో విజయనగరంలోని దీపావళి సామగ్రికి సంబంధించిన మందుగుండు సామగ్రికి చెందిన గోదాములు ఏర్పాటుచేశారు.ఈ మేరకు వాటిని బుధవారం గజపతినగరం సీఐ ఈఏవీ రమణతోపాటు ఎస్‌ఐ యు.మహేష్‌లు పరిశీలించారు.