Urea యూరియాను అధికంగా వాడొద్దు
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:56 PM
Do Not Overuse Urea యూరియాను రైతులు అధిక మొత్తంలో వినియోగించరాదని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సూచించారు. నానో యూరియాపై అవగాహన పెంచుకోవాలన్నారు. మంగళవారం ఉదయపురం గ్రామ రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
కురుపాం రూరల్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): యూరియాను రైతులు అధిక మొత్తంలో వినియోగించరాదని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సూచించారు. నానో యూరియాపై అవగాహన పెంచుకోవాలన్నారు. మంగళవారం ఉదయపురం గ్రామ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియా కొరత, వివిధ రకాల పంటల సాగు వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి యూరియా పంపిణీ చేశారు. ఆ గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. బాలికలతో మాట్లాడి.. సదుపాయాలపై ఆరా ఈశారు. తరగతి గదిలో కాసేపు ఉపాధ్యాయునిగా మారారు. మొండెంఖల్‌లో రైతులతో కూడా కలెక్టర్ ముచ్చటించారు. ఊర చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పూడికలు తీయిస్తామని, రైతులు కూడా చెరువు పనుల్లో భాగస్వాములవ్వాలని కోరారు. ఆ తర్వాత మొండెంఖల్ పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలు, మందులు తదితర విషయాలను వైద్యాధికారి బుద్ధేసును అడిగి తెలుసుకున్నారు. గుమ్మ గ్రామంలో వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి వినోద్ కుమార్, ప్రత్యేక ఉప కలెక్టర్ ఽధర్మచంద్రారెడ్డి, ఇంజనీరింగు అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.