Share News

మెంటాడను మన్యంలో కలపొద్దు

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:38 AM

మెంటాడ మండలాన్ని ఎప్పటిలాగే విజయనగరం జిల్లాలో కొనసాగించాలని, మన్యం జిల్లాలో కలపొ ద్దని విజ్ఞప్తి చేస్తూ ఆ మండల జేఏసీ నాయకులు కలెక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ను కోరారు.

  మెంటాడను మన్యంలో కలపొద్దు

విజయనగరం టౌన్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మెంటాడ మండలాన్ని ఎప్పటిలాగే విజయనగరం జిల్లాలో కొనసాగించాలని, మన్యం జిల్లాలో కలపొ ద్దని విజ్ఞప్తి చేస్తూ ఆ మండల జేఏసీ నాయకులు కలెక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ను కోరారు. ఈ మేరకు సో మవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. మెంటాడను మన్యంజిల్లాలో కలుపుతార ని ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నించారు. అటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ కార్యక్ర మంలో జేఏసీ నాయకులు, సభ్యులు గెద్ద అన్నవరం, రెడ్డి సన్యాసినాయుడు, రాయపల్లి రామారావు, లెంక రత్నాకర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:38 AM