వరదల సమయంలో కాజ్‌వే దాటొద్దు
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:02 AM
మండలంలోని దుగ్గేరు సమీపంలో అడారిగెడ్డ కాజ్‌వేను వరదల సమయంలో గిరిజనులు తొం దరపడి దాటొద్దని డిప్యూటీ ఎంపీడీవో సూర్యనారాయణ కోరారు. ఇక్కడ కాజ్‌వేను శుక్రవారం దాటుతుండగా ద్విచక్రవాహనంతో ఇద్దరు వ్యక్తులు గెడ్డలో పడి కొట్టుకుపోయి బయటపడిన విషయం విదితమే.
మక్కువరూరల్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని దుగ్గేరు సమీపంలో అడారిగెడ్డ కాజ్‌వేను వరదల సమయంలో గిరిజనులు తొం దరపడి దాటొద్దని డిప్యూటీ ఎంపీడీవో సూర్యనారాయణ కోరారు. ఇక్కడ కాజ్‌వేను శుక్రవారం దాటుతుండగా ద్విచక్రవాహనంతో ఇద్దరు వ్యక్తులు గెడ్డలో పడి కొట్టుకుపోయి బయటపడిన విషయం విదితమే. ఈనేప థ్యంలో శనివారం ఘటనా స్థలాన్ని సూర్యనారాయణతోపాటు పనసభద్ర వీఆర్వో రామకృష్ణ, గ్రామకార్యదర్శి బి.పోలినాయుడు, సీదరపు రామారావు పరిశీలించారు. దుగ్గేరు ఏజన్సీ ప్రాంతంలోని పొయ్యిమల గ్రామానికి చెం దిన చోడిపిల్లి చంద్ర, ఆయన బంధువు కలిసి శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై అడారిగెడ్డపై ఉన్న కాజ్‌వేను దాటివెళ్తుండగా హఠాత్తుగా వరద ఉధృతి పెరిగింది. దీంతో వారిద్దరూ జారిగెడ్డలో పడి కొట్టుకు పోతుండగా గుంటభద్ర గ్రామానికి చెందిన కొందరు వారిని రక్షించారు. ఈవిషయంపై శనివారం పత్రికల్లో ప్రచురితంకావడంతో అడారిగెడ్డ కాజ్‌వేను పరిశీలించారు. ఈ సంధర్బంగా సంఘటనకు గల కారణాలను అక్కడ ఉన్న వారిని అడిగితెలుకున్నారు. శుక్రవారం జరిగిన సంఘటనపై పరిశీలించామని, వివరాలను అధికారులకు పంపుతామని సూర్యనారాయణ విలేకరులకు తెలిపారు.