Do Not Be Negligent నిర్లక్ష్యం వహించొద్దు
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:59 PM
Do Not Be Negligent రైతుసేవా కేంద్రాల పరిధిలోని సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఉల్లిభద్రలో రైస్ మిల్లుతో పాటు సంతోషపురంలోని రైతుసేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు
గరుగుబిల్లి, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): రైతుసేవా కేంద్రాల పరిధిలోని సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఉల్లిభద్రలో రైస్ మిల్లుతో పాటు సంతోషపురంలోని రైతుసేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సమయంలో విధిగా నిబంధనలు పాటించాలన్నారు. రైతులకు అందుబాటులో సిబ్బంది ఉండాలని సూచించారు. వారికి అసౌకర్యం కలిగించరాదన్నారు. రైతులు ఏ మేరకు కేంద్రాలకు ధాన్యం విక్రయించారు.. ట్రక్ షీట్లు, తదితర సమాచారాన్ని ఏవో టి.జ్యోత్నను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ధాన్యం నిల్వలు తడవకుండా టార్పాలిన్లు సరఫరా చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ధాన్యం నిల్వలు తడిసినట్లయితే రైతులకు అవసరమైన సూచనలు అందించాలని ఆదేశించారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించకుండా చూడాలన్నారు. పలువురు మిల్లర్లు రైతుల నుంచి 4 కిలోలు అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. నిబంధనలు పాటించకుంటే మిల్లర్లపై చర్యలు తప్పవన్నారు.