జేఎస్‌ఎల్ కార్మికులకు న్యాయం చేయండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:12 AM
అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్ నగర్‌లో ఉన్న జేఎస్‌ఎల్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని టీఎన్‌టీయూసీ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు లెంక శ్రీను ఆధ్వర్యంలో కార్మికులు, యాజమాన్య ప్రతినిధులను, జాయింట్ లేబర్ కమిషనర్‌ను కలసి వినతిపత్రాలు అందజేశారు.
కొత్తవలస, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్ నగర్‌లో ఉన్న జేఎస్‌ఎల్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని టీఎన్‌టీయూసీ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు లెంక శ్రీను ఆధ్వర్యంలో కార్మికులు, యాజమాన్య ప్రతినిధులను, జాయింట్ లేబర్ కమిషనర్‌ను కలసి వినతిపత్రాలు అందజేశారు. ముందుగా కర్మాగారానికి వెళ్లి యాజమాన్య ప్రతినిధులు దినేష్ శర్మ, గోపాల కృష్ణను కలిశారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులకే ఎప్పుడూ అన్యాయం జరుగుతోందని, లాకౌట్ ఉన్నంత కాలం లే ఆఫ్ ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా కర్మాగారంలో లాకౌట్‌ను ఎత్తి వేసి న్యాయం చేయాలని కోరారు. అనంతరం విజయనగరంలోని జాయింట్ లేబర్ కమిషనర్‌ను కలసి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈనెల 5న యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చలను నిర్వహిస్తానని హామీ ఇచ్చారని లెంక శ్రీను తెలిపారు. 7,8 తేదీలలో తానే స్వయంగా కర్మాగారానికి వస్తానని చెప్పారని వివరించారు.