Share News

వైఎస్సార్‌ జయంతి నుంచైనా మంచి పనులు చేయండి

ABN , Publish Date - Jul 08 , 2025 | 11:59 PM

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తన తండ్రి వైఎస్సార్‌ జయంతి నుంచైనా మంచి పనులకు శ్రీకారం చుట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు.

వైఎస్సార్‌ జయంతి నుంచైనా మంచి పనులు చేయండి
మాట్లాడుతున్న హోంమంత్రి అనిత, పక్కన ఎమ్మెల్యే బేబీనాయన, డీసీసీబీ చైర్మన్‌ నాగార్జున

బొబ్బిలి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తన తండ్రి వైఎస్సార్‌ జయంతి నుంచైనా మంచి పనులకు శ్రీకారం చుట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. మహిళా ఎమ్మెల్యే పట్ల దారుణమైన వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్ర మంలో పాల్గొనేందుకు మంగళవారం ఆమె బొబ్బిలి వచ్చారు. స్థానిక కోటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ డీఎన్‌ఏలోనే అసభ్యత, కుసంస్కారం, అనైతికత ఉన్నాయని ధ్వజమెత్తారు. తండ్రి వైఎస్సార్‌ జయంతి నుంచైనా జగన్‌ మంచి పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. మహిళా ఎమ్మెల్యే పట్ల దారుణమైన వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు. అసభ్య పదజాలంతో రెచ్చిపోయే వైసీపీ నాయకులను జగన్‌ ఎందుకు కట్టడి చేయడం లేదన్నారు. ‘ఆ పార్టీ తీరుచూ స్తుంటే మాకే సిగ్గేస్తోందని, ఇదే మీ నాయకత్వ లక్షణమా? అని’ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే మాటల వీడియోలను నల్లపరెడ్డి తల్లి, అక్క, చెల్లి, భార్య ఇతర ఆడపడుచులకు చూపించాలని, మంచి వ్యక్తిత్వం కలిగిన మహిళా వైసీపీ నాయకు రాళ్లకు చూపించాలని కోరారు. నల్లపరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వైసీపీ నుంచి అతడిని తక్షణం సస్పెండ్‌ చేసి జగన్‌ తన నిజాయితీని చాటుకోవాల న్నారు. గంజాయి, డ్రగ్స్‌ అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారి భరతం పడుతున్నామని, నేరస్తుల ఆస్తులను అటాచ్‌ చేస్తున్నామన్నారు. ఎస్‌.కోటలో రూ.3 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసినట్లు తెలిపారు.

వర్క్‌ ఫ్రమ్‌ ఓదార్పు నిర్వహిస్తున్న జగన్‌

బెట్టింగ్‌లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నవారి విగ్రహాలను ఏడాది తరువాత ఏర్పాటు చేయడం, మందీ మార్బలంతో ఓదార్పు యాత్రలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని, జగన్‌ ఇటీవల వర్క్‌ ఫ్రమ్‌ ఓదార్పు నిర్వహించి తమ ఇంటికే బాధితులను రప్పించి ఓదార్చుతున్నారన్నారు. ఇది సిగ్గుచేటని, అనంత్‌బాబు కేసు విషయంలో కనీసం స్పందించని జగన్‌ ఇపుడు వింత పోకడలు చేస్తున్నారని విమర్శించారు.

బొబ్బిలి స్టేషన్‌కు సిబ్బందిని నియమిస్తాం..

బొబ్బిలి పట్టణానికి, మండలానికి ఒకే పోలీసు స్టేషన్‌ ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఎమ్మెల్యే పలు దఫాలు తన దృష్టికి తెచ్చారని హోంమంత్రి అని చెప్పారు. పోలీసుస్టేషన్‌ను కచ్చితంగా విస్తరించి, తగిన సిబ్బందిని నియమిస్తామన్నారు.

ఇది బేబీనాయన నియోజకవర్గం

బొబ్బిలిలో తనకు లభించిన అపూర్వ ఆదరణకు మంత్రి అనిత ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇది బొబ్బిలి నియోజకవర్గం కాదని, బేబీనాయన నియోజకవర్గమని అభివర్ణించారు. మహిళలు తనను ఎంతగానో ఆదరించారని, సొంత ఆడబిడ్డ మాదిరిగా చూడడం ఆనందం కలిగించిందన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బేబీనాయన, డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున, టీడీపీ సీనియర్‌ నేత అల్లాడ భాస్కరరావు, మడక తిరుపతినాయుడు, కర్రోతు తిరుపతిరావు, వాసిరెడ్డి సత్యనారాయణ, మహిళా నేతలు కింతలి శ్రీదేవి, వెలగాడ హైమావతి, సాలా స్వప్నదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:00 AM