అగ్నివీర్ ర్యాలీలో అపశృతి
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:55 PM
అగ్నివీర్ ఎంపికల్లో భాగంగా కాకినాడలో నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది.
సంతకవిటి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): అగ్నివీర్ ఎంపికల్లో భాగంగా కాకినాడలో నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన యువకుడు మృతిచెందాడు. సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట గ్రామానికి చెందిన గండ్రేటి సాయికిరణ్(19) కాకినాడలో నిర్వహిస్తున్న అగ్నివీర్ ర్యాలీలో పాల్గొన్నాడు. మంగళవారం రన్నింగ్ చేస్తుండగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే కాకినాడలోని జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 4గంటలకు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సాయికిరణ్ తల్లిదండ్రులతో పాటుగా చెల్లి శ్రీలేఖ కన్నీరు మున్నీరవుతున్నారు.