Pulse Polio 21న జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:30 PM
District-wide Pulse Polio Drive on the 21st జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
పార్వతీపురం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 905 కేంద్రాల్లో 99,507 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్టు వెల్లడించారు. బస్సు, రైల్వేస్టేషన్లలో 19 ట్రాన్సిల్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. 42 మొబైల్ బృందాల ద్వారా హైరిస్క్ మారుమూల ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని స్పష్టం చేశారు.