Share News

అ‘ద్వితీయ’ం

ABN , Publish Date - May 29 , 2025 | 11:32 PM

District Secures Second Place in Farm Pond Construction ఫాంపాండ్లు ( వ్యవసాయ పంట కుంటలు ) నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. 7506 ఫాంపాండ్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాల్లో 11,286 ఫాం పాండ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 6,307 ఫాం పాండ్లు నిర్మించారు.

అ‘ద్వితీయ’ం
సాలూరు మండలం తుండలో ఫాం పాండ్‌ పనులు చేపడుతున్న దృశ్యం

సాలూరు రూరల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి ): ఫాంపాండ్లు ( వ్యవసాయ పంట కుంటలు ) నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. 7506 ఫాంపాండ్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాల్లో 11,286 ఫాం పాండ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 6,307 ఫాం పాండ్లు నిర్మించారు. 847 ఫాంపాండ్లతో గుమ్మలక్ష్మీపురం తొలిస్థానంలో, 774తో కురుపాం ద్వితీయస్థానంలో, 665 నిర్మాణాలతో సీతంపేట మూడో స్థానంలో నిలిచాయి. సాలూరులో 417, పాచిపెంట 298, మక్కువ 344, బలిజిపేట 347, భామిని 314, గరుగుబిల్లి 307, జియ్యమ్మవలస 553, కొమరాడ 416, పాలకొండ 158, పార్వతీపురం 359, సీతానగరం 234, వీరఘట్టం మండలంలో 274 చొప్పున ఫాం పాండ్లు నిర్మించారు.

Updated Date - May 29 , 2025 | 11:32 PM