Share News

5th Rank Nationally జాతీయస్థాయిలో జిల్లాకు ఐదో ర్యాంకు

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:47 PM

District Secures 5th Rank Nationally ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర అభివృద్ధి, పనితీరు తదితర అంశాల్లో జిల్లా మెరుగైందని పేర్కొ న్నారు.

 5th Rank Nationally జాతీయస్థాయిలో  జిల్లాకు ఐదో ర్యాంకు

పార్వతీపురం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర అభివృద్ధి, పనితీరు తదితర అంశాల్లో జిల్లా మెరుగైందని పేర్కొ న్నారు. ముఖ్యంగా పాథమిక మౌలిక సదుపాయాల కల్పనలో జాతీయంగా ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. విద్యా రంగంలో 11 స్థానానికి చేరిందన్నారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యవసాయం, సాగునీటి వనరుల్లో కూడా పురోగతి సాధించినట్లు వెల్లడించారు. డేటా ఆధారిత పాలనపై నిరంతరం దృష్టిసారించడంతో మన్యం జిల్లా దేశంలోని అత్యుత్తమ ఆకాంక్షిత జిల్లాల జాబితాలోకి చేరిందని స్పష్టం చేశారు.

Updated Date - Nov 29 , 2025 | 11:47 PM