Share News

రాయపూర్‌ స్టీల్‌ప్లాంట్‌లో జిల్లావాసి మృతి

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:10 AM

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం రాయపూర్‌లో గల గోదావరి స్టీల్‌ ప్లాంట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన కె.ప్రసన్నకుమార్‌ (45) దుర్మర ణం చెందారు.

రాయపూర్‌ స్టీల్‌ప్లాంట్‌లో జిల్లావాసి మృతి

గరివిడి, సెప్టెంబరు 27(ఆంద్రజ్యోతి): ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం రాయపూర్‌లో గల గోదావరి స్టీల్‌ ప్లాంట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన కె.ప్రసన్నకుమార్‌ (45) దుర్మర ణం చెందారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రసన్నకుమార్‌కు భార్య భవానీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్ర్భాంతికి గురయ్యారు. గిరివిడి పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Updated Date - Sep 28 , 2025 | 12:10 AM