‘ఉపాధి’లో జిల్లాకు అవార్డు
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:03 AM
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాకు అవార్డు లభించింది.
- డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అందుకున్న పీడీ ఆనందరావు
పార్వతీపురం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాకు అవార్డు లభించింది. పథకం అమలు, జరుగుతున్న పనులు, వేతనదారులకు ఉపాధి చూపించడం వంటివి జిల్లాలో విజయవంతంగా జరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈ మేరకు గురువారం విజయవాడలో జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా డ్వామా పీడీ రామచంద్రరావు అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ మాట్లాడుతూ.. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉపాధి హామీ పనులు పూర్తిస్థాయిలో జరిగే విధంగా చర్యలు తీసుకుం టున్నట్లు తెలిపారు. అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.