District Magistrate inspects Bobbili Sub-Jail బొబ్బిలి సబ్‌జైలులో జిల్లా న్యాయాధికారి తనిఖీ
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:35 PM
District Magistrate inspects Bobbili Sub-Jail బొబ్బిలి సబ్‌జైలును జిల్లా న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎం.బబిత మంగళవారం తనిఖీ చేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు ఆమె ఈ తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది, ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల పట్ల జైలు సిబ్బంది గాని, తోటి ఖైదీలు గాని ఎటువంటి వివక్ష చూపరాదని అన్నారు.
బొబ్బిలి సబ్‌జైలులో
జిల్లా న్యాయాధికారి తనిఖీ
ఖైదీల పరిస్థితులు, అందుతున్న సౌకర్యాలపై ఆరా
లీగల్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకులకు సూచనలు
బొబ్బిలి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి సబ్‌జైలును జిల్లా న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎం.బబిత మంగళవారం తనిఖీ చేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు ఆమె ఈ తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది, ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల పట్ల జైలు సిబ్బంది గాని, తోటి ఖైదీలు గాని ఎటువంటి వివక్ష చూపరాదని అన్నారు. ఈమేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఖైదీల పట్ల వివక్ష చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైలులో నిర్వహిస్తున్న జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను కూడా తనిఖీ చేశారు. క్లినిక్‌ను సందర్శించే న్యాయవాదులు, పారాలీగల్ వలంటీర్ల బాధ్యతలపై ఆరా తీశారు. జైలులో ఉన్న నిందితులకు సకాలంలో న్యాయసహాయం అందించడానికే జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఏర్పాటు చేశామని, వాటిని సక్రమంగా నిర్వహించాలన్నారు. న్యాయవాదులు లేని ఖైదీలకు బొబ్బిలి మండల న్యాయసేవాకమిటీ ఉచితంగా న్యాయవాదిని సమకూర్చుతుందన్నారు. జైలులో సౌకర్యాలపై ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని, స్టోర్‌రూమ్‌ను పరిశీలించి నిత్యావసరవస్తువులన్నింటినీ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆమె వెంట సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎ.కృష్ణప్రసాద్ ఉన్నారు.