Share News

ఉత్సాహంగా జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:01 AM

జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను బొబ్బిలిలోని కళాభారతి ఆడిటోరి యంలో డీఎస్పీ భవ్యరెడ్డి శనివారం ప్రారంభించారు.

ఉత్సాహంగా జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు
పోటీలను ప్రారంభిస్తున్న డీఎస్పీ భవ్యరెడ్డి

బొబ్బిలి/రూరల్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను బొబ్బిలిలోని కళాభారతి ఆడిటోరి యంలో డీఎస్పీ భవ్యరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల పట్ల యువతీ యువకులు ఆసక్తి చూపాలన్నారు. జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో రాణించి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

ఈ పోటీల్లో విజయనగరం జట్టు మొదటి స్థానంలో నిలవగా, బొబ్బిలి, పార్వతీపురం జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ సెక్రటరీ సీహెచ్‌ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో నిర్వ హించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు పాల్గొని విజేతలకు మెడల్స్‌ అందజేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విజేతలు జూన్‌ 9, 10, 11 తేదీల్లో తాడిపత్రి లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గోనున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:01 AM