Share News

జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా పోటీలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:59 PM

పట్టణంలోని కస్పా ముని సిపల్‌ పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా డీఈవో మాణిక్యం నాయుడు మాట్లాడుతూ విజయవాడలో ఈనెల ఏడోతేదీన బెంగళూరు విశ్వేశ్వరయ్య ఇండిస్ర్టియల్‌ టెక్నాలాజిల్‌ మ్యూజియం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయని తెలిపారు.

జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా పోటీలు
విజయనగరం కలెక్టరేట్‌: రాష్ట్రస్థాయి సైన్స్‌డ్రామా పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న డీఈవో మాణిక్యంనాయుడు:

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కస్పా ముని సిపల్‌ పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా డీఈవో మాణిక్యం నాయుడు మాట్లాడుతూ విజయవాడలో ఈనెల ఏడోతేదీన బెంగళూరు విశ్వేశ్వరయ్య ఇండిస్ర్టియల్‌ టెక్నాలాజిల్‌ మ్యూజియం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఈ పోటీలకు ప్రథమ స్థానంలో నిలిచిన బొండపల్లి జడ్పీ పాఠశాల, రెండో స్థానం సాధించిన షికారు గంజిఏపీ మోడల్‌ స్కూల్‌, తృతీయ స్థానంలో నిలిచిన రామచంద్రపురం జడ్పీ పాఠశాల ఎంపికయ్యాయని చెప్పారు. కార్యక్రమంలోని కస్పా పాఠశాల హెచ్‌ఎం విశాలాక్షి, జిల్లా సైన్స్‌ అధికారి రాజేష్‌, రిసోర్స్‌పర్సన్‌ బాను ప్రకాష్‌ పాల్గొన్నారు.

నాసా శాస్త్రవేత్తలను కలుసుకోవడానికి ఎంపిక

జిల్లాలోని ఇటీవల జరిగిన సైన్స్‌ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులకు అపూర్వ అవకాశం దక్కింది. డెంకాడ మండలంలోని అక్కివరం ఏపీ మోడల్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్న పతివాడ భాను ప్రకాష్‌, వియ్యంపేట అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివిన తెర్లంగి సంజనలను ఈనెల 6 నుంచి 8 తేదీ వరకూ ఢిల్లీలో నాసా,ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకోవ డానికి ఎంపికయ్యారు. వీరిని బుధవారం విమానంలో పంపించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు.

ఉత్తమ ఫలితాలు సాఽధనకు కృషి: డీఈవో

రాజాం రూరల్‌, నవంబరు 5 (ఆంరఽఽధజ్యోతి): పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేయాలని డీఈవో మాణిక్యంనాయుడు కోరారు. బుధవారం రాజాం ప్రభుత్వోన్నత పాఠశాలలో రికార్డులను పరిశీలించా రు. అనంతరం పదోతరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. పాఠశాలలో పదేళ్లపాటు చదువుకున్న ఓల్డ్‌ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ సభ్యులు నాలుగు లక్షలతో నిర్మించిన మైత్రి వేదికను పరిశీలించారు. పాఠశాలకు సంఘ సభ్యులు చేపడుతున్న కార్యక్రమాల వివరాలను డీఈవోకు అధ్యక్షుడు కొత్తా సాయిప్రశాంత్‌ కుమార్‌ వివరించారు. కార్య క్రమంలో డీసీఈబీ చైర్మన్‌ రాజు, ఎంఈవోలు ప్రవీణ్‌, దుర్గారావు పాల్గొన్నారు.

ఫరేగిడి, నవంబరు 5,(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఇష్టంతో చదవాలని డీఈవో మణిక్యంనాయుడు కోరారు. లక్ష్మీపురం హైస్కూల్‌ను బుధవారం సమగ్రశిక్ష ఏపీసీ రామారావుతో కలిసి తనిఖీచేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ కృష్ణలత, ఎంపీ డీవో శ్యామలాకుమారి, ఎంఈవోలు వరప్రసాదరావు, బి.ఏరకయ్య ఉన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 11:59 PM