Sub-Depots సబ్ డిపోల ద్వారా సరుకుల పంపిణీ
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:24 PM
Distribution of Goods Through Sub-Depots జిల్లాలో సివిల్ సప్లైస్, జీసీసీ డిపోల పరిధిలో సబ్ డిపోల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎస్‌వో బి.అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం పాచిపెంటలో ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించారు.
పాచిపెంట, డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సివిల్ సప్లైస్, జీసీసీ డిపోల పరిధిలో సబ్ డిపోల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎస్‌వో బి.అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం పాచిపెంటలో ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం కొటికిపెంట సబ్ డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘జిల్లాలో 92 సబ్ డిపోలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సాలూరు మండలంలో మూడు, పాచిపెంట మండలంలో 17 సబ్ డిపోలు ఏర్పాటు చేశాం. చిన్న చిన్న వాహనాల ద్వారా ఆయా సబ్ డిపోలకు నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని సేల్స్‌మెన్, డీలర్లకు ఆదేశాలిచ్చాం. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందించేలా చర్యలు చేపడుతున్నాం. ఆంధ్రా నుంచి ఒడిశాకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెట్టాం.’ అని తెలిపారు. ఈ పరిశీలనలో ఏఎంవో బాలసరస్వతి, సివిల్ సప్లయ్ డీటీలు హేమలత, రామచంద్రరావు ఉన్నారు.