Third Phase మూడో విడతలో పంపిణీ
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:28 PM
Distribution in the Third Phase స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 25 నుంచి పండుగ వాతావరణంలో కార్డుల పంపిణీ ప్రారంభించ నున్నట్లు స్పష్టం చేసింది. మొత్తంగా నాలుగు విడతల్లో జిల్లాల వారీగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. జిల్లాలో మాత్రం మూడో విడతలో స్మార్ట్ రైస్ కార్డులు అందించ నున్నట్లు తెలిసింది.
పార్వతీపురం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 25 నుంచి పండుగ వాతావరణంలో కార్డుల పంపిణీ ప్రారంభించ నున్నట్లు స్పష్టం చేసింది. మొత్తంగా నాలుగు విడతల్లో జిల్లాల వారీగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. జిల్లాలో మాత్రం మూడో విడతలో స్మార్ట్ రైస్ కార్డులు అందించ నున్నట్లు తెలిసింది. కాగా వచ్చేనెల 6న మన్యానికి ఆ కార్డులు రానున్నట్టు సమాచారం. ఇంటింటికీ వెళ్లి కార్డుదారులకు వాటిని అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాత వారితో పాటు కొత్త వారికి కూడా స్మార్ట్ రైస్ కార్డులను అందించనున్నారు. కాగా వాటిని పొందిన వారు రాష్ట్రంలో ఏ డిపో నుంచైనా రేషన్ తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఉపాధి కోసం దూర ప్రాంతాల్లో ఉండేవారు, వలస బాట పట్టిన వారు రేషన్ కోసం ప్రత్యేకంగా తమ సొంత గ్రామాలకు రావాల్సిన అవసరం లేదు. వారు రాష్ట్రంలో ఉండే ఏ డిపోలో అయినా బియ్యంతో పాటు పంచదార తదితర నిత్యావసర సరుకులను పొందొచ్చు.