Share News

Displaced Tribals కదంతొక్కిన ఆదివాసీలు

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:36 AM

Displaced Tribals గిరిజన నిరుద్యోగుల కోసం ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేశారు. సోమవారం సీతంపేట నుంచి ఐటీడీఏ వరకు ఆదివాసీ సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో బైఠాయించి గిరిజన సమస్యల పరిష్కారం కోసం నినదించారు.

Displaced Tribals కదంతొక్కిన ఆదివాసీలు
ప్రత్యేక డీఎస్సీ, ఇతర సమస్యల పరిష్కారం కోసం నినదిస్తున్న ఆదివాసీలు

  • ఐటీడీఏ ఎదుట బైఠాయింపు

  • సీతంపేటలో ర్యాలీ

సీతంపేట రూరల్‌,అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): గిరిజన నిరుద్యోగుల కోసం ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేశారు. సోమవారం సీతంపేట నుంచి ఐటీడీఏ వరకు ఆదివాసీ సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో బైఠాయించి గిరిజన సమస్యల పరిష్కారం కోసం నినదించారు. బైలా ప్రకారం ఉపాధ్యాయ, ఉద్యోగ నియామకాలతో పాటు పదోన్నతులు, బదిలీలు జరగాలన్నారు. ప్రత్యేక షెడ్యూల్డ్‌ ఏరియా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ఆదివాసీలకు ఐటీడీఏ ద్వారా సబ్సిడీ,రాయితీ పథకాలు మంజూరు చేసి రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయ నియామకాలు కేవలం ఆదివాసీలతోనే భర్తీచేయాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తీసుకునేందుకు వచ్చిన ఏపీవో జి.చిన్నబాబుపై ఏజేఏసీ నాయకులు మండిపడ్డారు. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ వస్తేనే తాము ఇక్కడ నుండి కదులుతామని స్పష్టం చేశారు. దీంతో ఫోన్‌ ద్వారా ఐటీడీఏ అధికారులు పీవోతో మాట్లాడిం చారు. ఆ తర్వాత ఆదివాసీలు ఐటీడీఏ నుంచి వెనుదిరిగారు. సాయంత్రం ఐటీడీఏ కార్యాల యంలో ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ను వివిధ గిరిజన సంఘాల నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో ఐకాసా, ఏజేఏసీ నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:36 AM