Revenue Records రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:47 PM
Digitization of Revenue Records రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, తహసీల్దార్లతో సమీక్షించారు.
జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి
పార్వతీపురం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, తహసీల్దార్లతో సమీక్షించారు. రెవెన్యూ క్లినిక్‌ల నిర్వహణ, పనుల పురోగతి, పథకాల అమలుపై చర్చించారు. రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలని, సేవల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. . ధాన్యం కొనుగోలు నిర్వహణ సజావుగా జరగాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిశీలించి అర్జీదారులకు పరిష్కార మార్గం చూపాలని తెలిపారు. ప్రభుత్వ భూములపై అక్రమ కట్టడాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని స్పష్టం చేశారు.