దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్య
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:35 PM
రానున్న రోజుల్లో దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన అందించనున్నట్లు జిల్లా సహిత విద్యసమన్వయ కర్త ఎస్.సూర్యారావు తెలిపారు.
శృంగవరపుకోట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన అందించనున్నట్లు జిల్లా సహిత విద్యసమన్వయ కర్త ఎస్.సూర్యారావు తెలిపారు. శనివారం స్థానిక భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉచిత ఉపకరణాల ఎంపిక నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే భవిత కేంద్రాల్లో ట్యాబ్‌ల ద్వారా బోధన జరుగుతుందన్నారు. గత ఏడాది కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దివ్యాంగ విద్యార్థులు కంప్యూటర్ సహాయంతో పరీక్షలు రాసినట్లు తెలిపారు. భవిష్యత్‌లో డిజిటల్ బోధనకు సమగ్రశిక్ష అభియాన్ ప్రణాళికలు తయారు చేస్తుందన్నారు. ఈ విద్యాసంవత్స రానికి పలు రకాల ఉపకార వేతనాలు తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. కొత్తవలస, వేపాడ, ఎల్.కోట, ఎస్.కోట, జామి మండలాల నుంచి 152 మంది దివ్యాంగ విద్యార్ధులకు ఉచిత ఉపకార పరికరాల ఎంపికకు హాజరయ్యారు. వీరిలో 131మందిని అర్హులుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఈవో నర్సింగరావు, ఉపాధ్యాయులు ఎస్.భానుమతి తదితరులు ఉన్నారు.