పీ-4లో ఇబ్బందులను అధిగమించాలి: ఎస్‌ఆర్‌పీ
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:05 AM
పీ4 విఽధానంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందు లను అధిగమిస్తే మంచి ఫలితాలు వస్తా యని స్టేట్ రిసోర్స్‌పర్సన్ జి.శ్రీధర్ పేర్కొ న్నారు.బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యా లయంలో పీ-4విధానంపై డిప్యూటీ ఎంపీ డీవో శంకర్ జగన్నాథ్ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లు పంచాయతీ,సచివాలయ కార్యద ర్శులకు శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భం గా శ్రీధర్ మాట్లాడుతూ పీ-4 పాలసీ 2047వరకు కొనసాగుతుందని చెప్పారు. విధానంలో భాగంగా గ్రామాల్లో బంగారు కుటుంబాలను, మార్గదర్శకులను గుర్తించాలని సూచించారు. ఒక్కో ఉద్యోగి 20 కుటుంబాలను పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు.
నెల్లిమర్ల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పీ4 విఽధానంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందు లను అధిగమిస్తే మంచి ఫలితాలు వస్తా యని స్టేట్ రిసోర్స్‌పర్సన్ జి.శ్రీధర్ పేర్కొ న్నారు.బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యా లయంలో పీ-4విధానంపై డిప్యూటీ ఎంపీ డీవో శంకర్ జగన్నాథ్ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లు పంచాయతీ,సచివాలయ కార్యద ర్శులకు శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భం గా శ్రీధర్ మాట్లాడుతూ పీ-4 పాలసీ 2047వరకు కొనసాగుతుందని చెప్పారు. విధానంలో భాగంగా గ్రామాల్లో బంగారు కుటుంబాలను, మార్గదర్శకులను గుర్తించాలని సూచించారు. ఒక్కో ఉద్యోగి 20 కుటుంబాలను పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు.
ఫభోగాపురం, సెప్టెంబరు24(ఆంధ్రజ్యోతి): స్థానిక మండలపరిషత్ కార్యా లయంలో బుధవారం పేదరికాన్ని నిర్మూలించడం, అణగారిన కటుంబాల ఆర్థిక, సామాజికస్థితిని పెంచడం(పీ-4)పై కార్యదర్శులు,డిజిటల్ అసిస్టెంట్లు, వీఆర్వోలకు బుధవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో స్వరూపారాణి మాట్లాడుతూ గ్రామాల్లో పి-4పై అవగాహన కల్పించి ఉప యోగాలు తెలియ జేయాలన్నారు.
ఆర్థిక స్వావలంబన కోసమే పీ-4
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 24 ( ఆంధ్రజ్యోతి): ఆర్థిక స్వాలం బన కోసం ప్రభుత్వం పీ-4 విధానాన్ని అమలు చేస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. బుధవారం విజయనగరంలోని నగరపా లక సంస్థ కార్యాలయంలో పీ-4ని సమర్థవంతంగా అమలు చేసే విధానంపై వెల్ఫేర్, శానిటేషన్, ఉమెన్ ప్రొటెక్షన్, హెల్త్, ఎడ్యుకేషన్ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా నల్లనయ్య మాట్లాడుతూ, ఇప్పటి వరకూ జరిగిన సర్వేలో నగరపాలక సంస్థ పరిధిలో 3,760 బంగారు కుటుం బాలను గుర్తించినట్లు తెలిపారు.ఇందులో వివిధ రూపాల్లో సాయం అందిం చేందుకు 299 మంది మార్గదర్శకులు ముందుకువచ్చారన్నారు. ఇంకా 2,397 కుటుంబాలను దత్తత తీసుకోవలసి వుందన్నారు. కార్యక్రమంలో టీపీఆర్‌వో సింహాచలం పాల్గొన్నారు.