నీరు కలుషితం వల్లే డయేరియా: ఎమ్మెల్యే
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:06 AM
మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏడొం పులగెడ్డ పొంగి పొర్లడంతో తాగునీరు కలుషితమై డయేరియా సోకిందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.
రామభద్రపురం,అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏడొం పులగెడ్డ పొంగి పొర్లడంతో తాగునీరు కలుషితమై డయేరియా సోకిందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. ముచ్చర్లవలస, బూసాయవలసల్లో 16 మంది డయేరియా బారినపడ్డారని, వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని చెప్పారు. గురువారం రామభద్రపురంలో డయేరియా రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతినాయుడు, పార్టీ మండలాధ్యక్షులు కరణం విజయ భాస్కరరావు, ఎంపీటీసీ సభ్యులు భవిరెడ్డి చంద్ర, వసంతుల తిరుపతిరావు, ముచ్చ ర్లవలస సర్పంచ్ కనిమెరక శంకరరావు, టీడీపీ నాయకులు సీహెచ్.రామకృష్ణ, చొక్కాపు రామారావు, గంట సాయి, వసంతుల వెంకటరావు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వైద్య శిబిరాలు నిర్వహించా లని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జీవనరాణి ఆదేశించారు. గురువారం రామభద్ర పురం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఎక్కువగా జరిగే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం డయేరియా సోకిన బూసాయవలస, ముచ్చర్లవలస గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. వైద్యాధికారులతో మాట్లాడి డయేరియా అదుపునకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రామభద్రపురం పీహెచ్‌సీ అధికారులు లక్ష్మి, దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
బొబ్బిలి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధిలో పలువురికి మం జూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బేబీనాయన గురువారం బొబ్బిలి దర్బారుమహల్‌లో లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మునిసిప ల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు, టీడీపీ నాయకులు ఏగిరెడ్డి శ్రీధర్, కాకల వెంకట రావు,ఎక్కుడు వాసు, మడక అప్పారావు పాల్గొన్నారు.